తలైవానా మజాకా ...ఫీవర్ మొదలయిపోయిందిrajni
2020-01-07 20:16:57

సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా తెరక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్త్జి అయింది. మరో రెండ్రోజుల్లో రిలీజ్ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి.. సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే కోలీవుడ్ లో దర్బార్ ఫీవర్ మొదలయింది. గతంలో రజనీకాంత్ నటించిన పేట,కబాలి సినిమాల మూవీ విడుదల సందర్భంగా చెన్నై లో కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించి ఉద్యోగులకు మూవీ టికెట్స్ పంచాయి. ఇప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు హాలిడే ప్రకటిస్తూ, మూవీ టికెట్స్ పంచడంతో ఆ సంస్థల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సేలం లోని రజనీకాంత్ అభిమానులు “దర్బార్” మూవీ ప్రదర్శించే థియేటర్స్ పై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించడానికి పోలీసుల అనుమతి కూడా కోరుతున్నారు. ఎంతైనా తలైవానా మజాకా ?

 

More Related Stories