ఫైనల్ షెడ్యూల్ లో దర్బార్ ! Darbar
2019-08-20 09:32:57

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సంచలన చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో దర్బార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆ మధ్య ముంబైలో లాంఛనంగా ప్రారంభించారు.  తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని శుభస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  రజినీకాంత్‌తో ఎ.ఆర్.మురుగదాస్ పనిచేయడం ఇదే మొదటిసారి. సింహభాగం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ జైపూర్ లో ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఇక లైకా ప్రొడక్షన్స్‌లో ఇది రజినీకాంత్‌కు మూడో సినిమా కాగా ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ డ్యూయల్ రోల్ లో న‌టిస్తుండని అందులో ఒకటి పోలీసు అధికారి పాత్ర అని తెలుస్తోంది. అయితే పాతికేళ్ళ తర్వాత రజనీ మళ్ళీ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారని చెబుతున్నారు. 

ఇక జైపూర్ షూట్ కోసం నయనతార, రజనీకాంత్ కలిసి ఫ్లైట్ లో వెళుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ ఫోటో చూసిన రజనీ అభిమానులు మురిసిపోతున్నారు, ఎందుకంటే రజనీ ఎంత పెద్ద సూపర్ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అలాంటి సూపర్ స్టార్ కూడా సామాన్యులలాగే ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించడం మామూలు విషయం కాదు. ఇదే విషయం ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ ని సంతోష పెడుతోంది. రజనీ ఎంత నిరాడంబరంగా ఉంటారో తెలియచెప్పే ఘటన ఇదని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక హీరో గారు ఎకానమీలో వెళ్తే హీరోయిన్ కూడా వెళ్ళక తప్పదుగా. ఇక ఈ సినిమా మరో మూడు వారాల్లో షూట్ పార్ట్ కంప్లీట్ చేసుకోనుందని అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. 

More Related Stories