దర్బార్ రివ్యూDarbar
2020-01-09 20:35:18

రజినీకాంత్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే కొన్నేళ్లుగా రజినీ సినిమాలు తెలుగులో పెద్దగా విజయం సాధించడం లేదు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోడానికి దర్బార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.. మరి ఇదెలా ఉందో చూద్దాం..

కథ :

ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) ముంబై పోలీస్ కమీషనర్. ఆయనకు ఓ కూతురు ఉంటుంది. ఆమె పేరు వల్లి (నివేదా థామస్). తల్లి రెండేళ్లప్పుడే చనిపోవడంతో మరో పెళ్లి కూడా చేసుకోకుండా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు ఆదిత్య. దాంతో నాన్నకు పెళ్లి చేసి తోడు ఇవ్వాలని లిల్లి (నయనతార)ని ఆదిత్య జీవితంలోకి వచ్చేలా చేస్తుంది వల్లి. మరోవైపు డ్యూటీతో బిజీగా ఉంటాడు ఆదిత్య అరుణాచలం. ఈ క్రమంలోనే ముంబైకు వచ్చీ రాగానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ కేస్ ఛేదిస్తాడు. అప్పుడే ముంబైలో జరుగుతున్న డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకుని వాటిని అంతమొందించే పనిలో పడతాడు. ఆ క్రమంలోనే ప్రధాన విలన్ హరి చోప్రా (సునీల్ శెట్టి) గురించి తెలుసుకుంటాడు. 27 ఏళ్ల కింద 30 మంది పోలీసులను సజీవదహనం చేసి తప్పించుకుని విదేశాలకు పారిపోతాడు హరి. ఆయన్ని పట్టుకోడానికి స్కెచ్ వేస్తాడు ఆదిత్య. అయితే ఇదిలా జరుగుతుండగానే ఆదిత్య కూతురు వల్లి(నివేదా థామస్) చనిపోతుంది. ఆమె ఎలా చనిపోతుంది.. ఎవరు చంపేస్తారు.. మధ్యలోకి లిల్లి (నయనతార) ఎలా వచ్చింది.. అనేది అసలు కథ..

కథనం:

రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా.. అది రజినీకాంత్ సినిమా.. తలైవా స్క్రీన్ మీద కనిపిస్తే ఎదో తెలియని వైబ్రేషన్.. కాకపోతే కొన్నేళ్లుగా ఆ వైబ్రేషన్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.. రజనీ ఇమేజ్ ను పర్ఫెక్టుగా హ్యాండిల్ చేసే దర్శకుడు కరువు అవుతున్నాడు.. ఇన్నాళ్లకు మురుగుదాస్ మిగిలిన దర్శకులతో పోలిస్తే రజనీని కాస్త బెటర్ గా వాడుకున్నట్టు అనిపించింది.. చాలా ఏళ్ల తర్వాత పోలీసు ఆఫీసర్గా రజనీకాంత్ రఫ్ ఆడించాడు.. ఆదిత్య అరుణాచలం అంటూ పాత సూపర్ స్టార్ ను గుర్తు తెచ్చాడు..

ఇక మురుగదాస్ కూడా తెలిసిన కథే అయినా.. రేసీ ఈ స్క్రీన్ ప్లేతో కథను ముందుకు నడిపించాడు.. ఫస్టాఫ్ చాలా చోట్ల విజిల్ పడే సన్నివేశాలు ఉన్నాయి.. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా రాసుకున్నాడు మురుగుదాస్.. ఈ వయసులో కూడా రజనీ ఎనర్జీ చూస్తే వావ్ అనిపిస్తుంది.. డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు మురుగదాస్.. దానికి రజనీ ఇమేజ్ ను ఫర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి దర్బార్ కథ అల్లుకున్నాడు.. ఈ క్రమంలోనే మాస్ ఆడియన్స్ వచ్చేలా చాలాచోట్ల అదిరిపోయే సన్నివేశాలు ఉన్నాయి..

ఉమెన్ ట్రాఫికింగ్ ట్రాక్ చేసే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.. ఇంటర్వెల్ ఎపిసోడ్.. సెకండాఫ్ లో మెట్రో ఫైట్ సీన్ అభిమానులకు కన్నుల పండుగ.. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయింది.. సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నా కూడా చాలావరకు ల్యాగ్ అయినట్టు అనిపించింది.. క్లైమాక్స్ కూడా ఈజీగా తేల్చేసాడు దర్శకుడు.. విలన్ బలంగా ఉన్న ఎలివేషన్ సన్నివేశాలు తక్కువగా ఉన్నాయి..

రజినీకాంత్ నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు.. ఆయన కుమ్మేసాడు.. నయనతారకు పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కలేదు.. క్రేజ్ కోసం పెట్టినట్లు అనిపించింది.. ప్రతినాయకుడుగా సునీల్ శెట్టి బాగున్నాడు.. కానీ బలమైన సన్నివేశాలు పడలేదు.. రజనీకాంత్ కూతురుగా నివేద థామస్ అద్భుతంగా నటించింది.. ఓవరాల్గా ఇది రజనీకాంత్ దర్బార్.. అభిమానులకు ఫుల్ మీల్స్..

నటీనటులు:

రజినీకాంత్ నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు.. చాలా ఏళ్ళ తర్వాత ఖాకీ డ్రస్ వేసుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపించాడు ఈయన. ముఖ్యంగా వన్ మ్యాన్ షోతో అలరించాడు. ఎనర్జిటిక్ కాప్‌గా కనిపించాడు. ఇక నయనతార కొన్ని సన్నివేశాల్లోనే కనిపించింది. నివేదా థామస్ మంచి స్కోర్ చేసింది. చాలా బాగా నటించింది. రజినీ కూతురుగా బాగా చేసింది. సునీల్ శెట్టి పేరుకు విలన్ అయినా కూడా బలమైన సన్నివేశాలు అయితే పడలేదు. యోగిబాబు కామెడీ పర్లేదు..

టెక్నికల్ టీం:

అనిరుధ్ పాటల కంటే కూడా ఆర్ఆర్ అదిరిపోయింది. ముఖ్యంగా బాషా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో వాడుకున్నాడు అనిరుధ్. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సూపర్. ముంబై విజువల్స్ చాలా అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్లేదు.. సెకండాఫ్ కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయ్యాయి. ఇక దర్శకుడు మురుగదాస్ మరోసారి పక్కా మాస్ సినిమాతోనే వచ్చాడు. అయితే రజినీ ఇమేజ్‌పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో అక్కడక్కడా కథ గాడి తప్పింది. కథనం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే దర్బార్ మరో లెవల్ సినిమా అయ్యుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా ఒక్కమాట:

దర్బార్.. రజినీకాంత్ రప్ఫాడించాడు.. కానీ కండీషన్స్ అప్లై..

రేటింగ్: 2.75/5.

More Related Stories