స్టార్ హీరోకి భార్యకు మధ్య మళ్ళీ గొడవలు...Darshans
2019-08-14 18:16:57

శాండల్‌వుడ్‌ లో స్టార్ హీరోగా కొనసాసగుతున్న ప్రముఖ నటుడు దర్శన్ దంపతుల మధ్య మరోసారి వివాదం చెలరేగినట్టు ప్రచారం మొదలయ్యింది. నిజానికి తాజాగా వీరిద్దరూ ట్విట్టర్‌ లో పరస్పరం ఒకరినొకరు అన్‌ ఫాలో అయ్యారు. విజయలక్ష్మి దర్శన్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌లో ఖాతా నుంచి దర్శన్‌ పదాన్ని తొలగించటంతో ఈ ప్రచారానికి ఆద్యం పోసినట్టయ్యింది. అయితే ఈ వదంతులను నమ్మవద్దని విజయలక్ష్మీ ట్వీట్‌ చేశారు. 

పైకి అదేమీ లేదని చెబుతున్నా ఇద్దరి మధ్య ఏదో వివాదం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. గతంలోనే ఇద్దరికీ గొడవ జరగడంతో ఈ ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. కానీ మీ మధ్య విడుదలైన యజమాన సినిమా మేకింగ్‌ వీడియోలో దంపతులిద్దరూ కనిపించారు. దాంతో ఇద్దరూ సవ్యంగా ఉన్నారని అభిమానులు భావించారు ఆ లోపే మళ్లీ ఏవో బిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గొడవలను సరిదిద్దడానికి ఓ నటుడు, రాజకీయ నాయకుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

నటుడు దర్శన్ భార్య తన భర్తకు, నిఖితకు మధ్య వివాహేతర సంబంధం ఉందనీ, ఈ కారంణం గానే దర్శన్ మద్యం సేవించి తనను రోజూ వేధిస్తున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యా దు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారంలో ఆ హీరో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మూడు నాలుగేళ్ల క్రితం కూడా వీరి మధ్య మళ్ళీ గొడవలు రావడంతో దివంగత అంబరీష్‌ సద్దుబాటు చేశారు. ఇప్పుడు ఎవరు సర్దుబాటు చేస్తారో మరి.

More Related Stories