బంప‌రాఫ‌ర్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ హారిక దేత్త‌డి హారిక



Dethadi Harika
2021-03-09 13:04:18

ప్రముఖ యుట్యూబర్ బిగ్ బాస్ 4 కంటెస్ట్టెంట్  దేత్త‌డి హారికకు తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమిస్తూ నియామక పత్రం అందజేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యటక భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ హారికను నియామక పత్రాన్ని అందజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. అలేఖ్య హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించామని..ఆమె రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత వన్నె తెస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హారిక యూట్యూబ్ లో  దేత్త‌డి ఛానల్ తో ఫేమస్ అయ్యారు. ఆమె ఛానల్ ద్వారా డిఫరెంట్ వీడియోలు తీసి పక్కా తెలంగాణ యాస తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ 4 లో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హారిక టాప్ లో 5 లో నిలిచారు. ఇక ప్రస్తుతం హరికకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

More Related Stories