కొరటాల సెంటిమెంట్ బ్రేక్ చేయడం లేదట Devi Sri Prasad
2019-09-27 15:17:19

హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు నటిస్తున్న సైరా రిలీజ్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు. మరో పక్క కొరటాల ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి టెక్నీషియన్లు అందరూ దాదాపుగా ఖరారవగా ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు ఇన్ సైడ్ టాక్. అయితే ఈ సినిమాకి కొర‌టాల సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. 

కొర‌టాల తన మొదటి సినిమా మిర్చి నుండి.. ఆ తరువాత కొరటాల తీసిన శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, మ‌హ‌ర్షి చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ను కాదని త‌న సెంటిమెంట్‌ ను బ్రేక్ చేస్తున్నాడని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాదే సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 3 న చిరు-కొరటాల సినిమా ముహూర్తం ఉంటుందని అంటున్నారు. ఆ తరువాత ఒక వారం గ్యాప్ ఇచ్చి నవంబర్ 10 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనేది అందుతున్న సమాచారం. ఈ సినిమా 2020 సమ్మర్ ఎండింగ్‌లో లేదా, దసరాకి రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.  

More Related Stories