దేవీ శ్రీ ప్రసాద్ కూడా అలాగే మారిపోయాడా...devi Sri Prasad
2020-03-05 00:04:03

ఈ రోజుల్లో మన హీరోలు డబ్బులు తీసుకోవడం లేదు. కేవలం వాటాలు మాత్రమే తీసుకుంటున్నారు. దర్శకులు కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు సినిమాకు ఇంత అని తీసుకున్న సంగీత దర్శకులు ఇప్పటినుంచి సినిమాలో తమకు కూడా భాగం కావాలి అంటున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పద్ధతికి కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలికాడు. 

ఇప్పటికే బాలీవుడ్ లో ఏ ఆర్ రెహమాన్ లాంటివాళ్ళు సినిమాకు రెమ్యూనరేషన్ బదులుగా వాటాలు తీసుకుంటారు. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన తాజాగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన నీ నవ్వు నీలి సముద్రం పాట సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాకు సుకుమార్ రేటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు. 

ముందు ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అంటే అందరూ షాకయ్యారు. ఇంత చిన్న సినిమాకు ఆయన ఎందుకు సంగీతమందిస్తున్నాడు అంటూ ఆరా తీశారు. అయితే ఇప్పుడు అసలు విషయం తెలిసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పారితోషకం తీసుకోవడం లేదు. కేవలం లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటున్నాడు. సినిమా విడుదలైన తర్వాత అందులో కొంత షేర్ ఈయన కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2న ఉప్పెన విడుదల కానుంది. ఈ సినిమాతో కచ్చితంగా రెండు కోట్ల కంటే పైన తనకు లాభాల్లో వాటా వస్తుందని నమ్ముతున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఇది వర్కౌట్ అయితే ఇప్పటి నుంచి పెద్ద సినిమాలకు కూడా ఇదే చేయాలని ఫిక్స్ అయిపోతున్నాడు ఈయన.
 

More Related Stories