అర్జున్ రెడ్డి దెబ్బకి సినిమాలకి ధ్రువ గుడ్ బై..ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలటdruva
2020-03-12 02:57:30

టాలీవుడ్‌ లో అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. తెలుగులో విజయ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో కూడా రీమేక్ ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ సినిమాని తమిళంలో ఆదిత్య వర్మ అనే టైటిల్ తో రెండుసార్లు తెరకెక్కించారు. బాలా దర్శకత్వంలో వర్మ పేరుతో ఈ సినిమా చిత్రీకరించగా అది సరిగా రాలేదని చెబుతూ దర్శకుడిని తప్పించి మళ్లీ రీషూట్ చేశారు. ‘ఆదిత్య వర్మ’ సినిమాని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి శిష్యుడు గిరీశయ్య తెరకెక్కించాడు.

అయితే రెండు బాషలలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తమిళంలో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగు అర్జున్ రెడ్డి చిత్రంతో ఆదిత్య వర్మ సినిమాను పోల్చడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలో ధృవ్ విక్రమ్‌ మీద అయితే దారుణమైన ట్రోల్స్ కూడా చేశారు. అయితే ట్రోల్స్ సంగతి పక్కన పెడితే తనతో రెండు సార్లు సినిమా తీసినా అది వర్కౌట్ కాలేదు కాబట్టి తాను హీరో మెటీరియల్ కాదని ధృవ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఆయన సినిమాలకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్టు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగులో కూడా కొందరు వారసులు నటన మాని ఇందులో ఇంటరెస్ట్ ఉంటే అందులో రాణించగలిగితే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

More Related Stories