నాగార్జున మూవీ నుంచి కాజల్ తప్పుకుందా.?



Did kajal left from nagarjuna movie
2021-09-16 22:50:26

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలి అనేది నాగార్జున ప్లాన్. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంటే.. నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా కంటే ముందుగా నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ స్టార్ట్ చేశారు. వైల్డ్ డాగ్ మూవీలో యాక్షన్ పార్ట్ ఎక్కువ అవ్వడం.. ప్రవీణ్‌ సత్తారుతో చేస్తున్న మూవీ కూడా యాక్షన్ మూవీయే కావడంతో కథను మార్చమన్నారు నాగ్. ఈ కారణంగా కొన్నాళ్లు ఈ సినిమా ఆగింది. ఆతర్వాత రైటర్ అబ్బూరి రవిని రంగంలోకి దింపారు. ఆయన చేసిన మార్పులు చేర్పులు నాగార్జునకు నచ్చడంతో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆమధ్య నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్ ఓ వారం రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఆమె పై కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కాజల్ పై చిత్రీకరించాల్సివుంది. అయితే.. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలిసింది. అందుచేత ఆమె పై యాక్షన్ సీన్స్ షూట్ చేయడం కుదరదు. అందుచేత కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. దీంతో ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ తీసుకోవాలి అనుకుంటున్నారట మేకర్స్. మరి.. కాజల్ ప్లేస్ లో ఎవర్ని ఎంపిక చేస్తారో..? మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
 

More Related Stories