కొడుక్కి 3కోట్ల కారు..క్లారిటీ ఇచ్చిన సోనూ Sonu Sood
2021-06-21 17:28:47

రియల్ హీరో సోను సూద్ తన కొడుకుకు ఫాదర్స్ డే సందర్భంగా మూడు కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు. సోను సోను వద్ద చాలా డబ్బు ఉందని అంటున్నారు. మూడు కోట్ల కారు కొడుకుకు గిఫ్ట్ గా ఇచ్చే బదులు ఆపదలో ఉన్న వాళ్ళని ఎందుకు ఆదుకోలేదని విమర్శిస్తున్నారు. 

అయితే తాజాగా ఈ కామెంట్లపై సోనూ స్పందించారు. తాను కొడుక్కి మూడు కోట్ల కారు గిఫ్ట్ గా ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం కారులో టెస్ట్ డ్రైవ్ కు వెళ్ళామని అన్నారు. అయినా ఫాదర్స్ డే అయితే కొడుకు తనకు గిఫ్ట్ ఇవ్వాలని కానీ తానెందుకు ఇస్తానని ప్రశ్నించారు. అయితే తనపై వస్తున్న వార్తలు కొంతమంది నమ్మలేదని తనకు సపోర్ట్ చేశారని అని అన్నారు. అలాంటివారికి సోను కృతజ్ఞతలు తెలిపారు. ఫాదర్స్ డే సందర్భంగా తన కుమారులతో గడపడం చాలా ఆనందంగా ఉందన్నారు.

More Related Stories