అల వైకుంఠపురములో... అలా మురళీ శర్మకు గొడవైందా...Murali Sharma Allu Arjun.jpg
2020-01-21 08:49:22

అల వైకుంఠపురములో.. ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాడు బన్నీ. ఈ చిత్రంతో మరోసారి ఫ్యామిలీ సినిమాల సత్తా ఏంటనేది తెలుస్తుంది. అప్పట్లో అత్తారింటికి దారేది అంటూ రికార్డులు తిరగరాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. మరోసారి ఇప్పుడు బన్నీతో అలాంటి రికార్డులే చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు రికార్డులతోనే వార్తల్లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మకు గీతా ఆర్ట్స్ తో గొడవైందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా వైరల్ అవుతుంది.

ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ తో మురళి శర్మకి మాటల యుద్ధం జరిగిందని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన మనస్పర్ధలే అని తెలుస్తుంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు మురళీ శర్మ. మధ్యతరగతి తండ్రి వాల్మీకిగా ఈయన నటనకు నీరాజనాలు పడుతున్నారు జనాలు. ఈయనకు రోజువారీ పారితోషికం తీసుకోవడం అలవాటు. అల వైకుంఠపురములో సినిమాకు మాత్రం ఒకేసారి 50 రోజుల కాల్షీట్స్ అవసరం పడ్డాయి.. దాంతో ఒకేసారి అంతా ఇవ్వడానికి గీతా ఆర్ట్స్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే షూటింగ్ ఆలస్యం అయి 70 రోజులు కావడంతో మిగిలిన 20 రోజుల పారితోషికం కూడా ఇవ్వాలని మురళీ శర్మ పట్టుబట్టినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ దీన్ని గీతా ఆర్ట్స్ లైట్ తీసుకోవడంతో ఈయన అలిగి సినిమా ప్రమోషన్స్ తో పాటు సక్సెస్ పార్టీలకు కూడా రావడం లేదని తెలుస్తుంది.

కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వస్తున్న నేపథ్యంలో మురళి శర్మకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని అల్లు అరవింద్ ఇంకా సెటిల్ చేయకపోవడం కూడా విడ్డూరమే. ఈ విషయంలో అల్లు అరవింద్, మురళీ శర్మ మధ్య కొంత సీరియస్ వాతావరణమే వచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట.

More Related Stories