ఇక బాలీవుడ్ జెర్సీ...ఆయనతోనేనా ?jersey
2019-07-17 17:03:24

ప్రస్తుతం రీమేక్స్ సీజన్ నడుస్తోంది. వేరేవేరే బాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలని తమ బాషలలోకి రీమేక్ చేసి సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. అలా రీమేక్ అయిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కూడా, తాజాగా ఆలా రీమేక్ అయి కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా. షాహీద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొన్ననే రిలీజయి 300 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. తాజాగా ఇప్పుడు మరో రీమేక్ గురించిన వార్త భలే ఆసక్తికరంగా మారింది. మొన్నీమధ్యన నాని హీరోగా  శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన జెర్సీ సినిమా వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అందులోని ఎమోషనల్ కంటెంట్ కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఆ సినిమాకి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ వసూళ్ల పరంగా పెద్దగా లాభించలేదు. అయితే సినిమాలో కంటెంట్ బాగుండడం ఇంటర్నేషనల్ యాక్సేప్టేన్స్ ఉన్న క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో జెర్సీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లన్స్ జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాని కరణ్ జోహార్ తీస్తున్నారని వార్తలు వచ్చినా, ఇప్పుడు దిల్ రాజు అల్లు అరవింద్ లు కలిసి జాయింట్ వెంచర్ గా ఈ సినిమాని అక్కడ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇంకా సహా నిర్మాతగా ఒరిజినల్ సినిమాని నిర్మించిన సితార సంస్థ కూడా వ్యవహరించనుందట. ఈ సినిమాలో నాని ప్లేస్ లో హీరోగా షాహిద్ కపూర్ ని అనుకుంటున్నాడట. కబీర్ సింగ్ హిట్ తో ఊపు మీద ఉన్న షాహిద్ కి జెర్సీ లాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుందో మరి ?

More Related Stories