దిల్ రాజు చేతికి నాంది రీమేక్ రైట్స్



Dil Raju
2021-02-25 16:56:26

టాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. మంచి సినిమా వచ్చిందటే రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోడానికి రెడీగా ఉంటారు. ఇప్పటికే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కోసం బేర సారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నాంది రీమేక్ రైట్స్ అంశం కూడా తెరమీదకు వచ్చింది. ఈ సినిమాపై బాలీవుడ్ కూడా బాలీవుడ్ వాళ్ళ కన్ను పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.  

అన్ని భాషల రైట్స్ ను దిల్ రాజు మంచి రేటుకే దక్కించుకున్నట్టు సమాచారం. ఇటీవల దిల్ రాజు నాంది టీమ్ ను పిలిపించుకుని మరీ అభినందించారు. అదే సమయంలో రీమేక్ రైట్స్ కోసం కూడా బేర సారాలు జరిగినట్టు సమాచారం. నాంది సినిమాకు తెలుగులో సూపర్ హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఒక రేంజ్ అయితే రావడం లేదు. కానీ ఇలాంటి కథలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు "నాంది" సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే దిల్ రాజు "హిట్" సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఆ తరవాత నాంది ని పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. 
 

More Related Stories