కేజీఎఫ్ ఏపీ తెలంగాణా రైట్స్ ను సొంతం చేసుకున్న దిల్ రాజు



Dil Raju
2021-02-22 11:00:34

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా కేజీఎఫ్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించాడు. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు... ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విజయం తరవాత ప్రశాంత్ నీల్ సీక్వెల్ కేజీఎఫ్ 2 ను మొదలు పెట్టారు. 

ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అంచనాలకు తగ్గట్టుగా భారీగా తారాగణం నటిస్తోంది. దాంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఏపీ& తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 65కోట్లకు సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 16న విడుదల కానుంది.

More Related Stories