దిల్ రాజు ఇంటి నుంచి వారసుడు వస్తున్నాడు.. Dil Raju
2019-10-08 17:39:24

ఇండస్ట్రీలో వారసుల రాజ్యం నడుస్తుందిప్పుడు. ఒక్కరు వస్తే చాలు.. వాళ్ల పేరు చెప్పుకుని వరసగా ఇండస్ట్రీకి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు ఇంటి నుంచి కూడా వారసుడు వస్తున్నాడు. రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశీష్ రెడ్డి ఇప్పుడు హీరో అవుతున్నాడు. దీనికి సంబంధించిన తెరవెనక పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వారసుడి ఎంట్రీ కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నాడు ఈయన. దిల్ రాజు ఇంటి నుంచి ఇప్పటి వరకు నటులుగా ఎవరూ రాలేదు. కాకపోతే రాజు బాధ్యతలను మాత్రం ఆయన అన్నయ్య కొడుకు హర్షిత్ తీసుకున్నాడు. ఆయన సినిమాలకు ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తుంటారు హర్షిత్ రెడ్డి. ఆ మధ్య రాజ్ తరుణ్ హీరోగా లవర్ సినిమాను నిర్మించింది ఈయనే. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ బాబాయ్ కి తోడుగా నిలుస్తున్నాడు హర్షిత్ రెడ్డి. ఇప్పుడు ఆయన తమ్ముడు ఆశిష్ రెడ్డి హీరో అవుతున్నాడు. దీనికోసం భారీగానే రంగం సిద్ధం చేస్తున్నాడు దిల్ రాజు. హుషారు సినిమాతో విజయం సాధించిన శ్రీ హర్ష కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకుడు. కచ్చితంగా ఈ చిత్రంతో తన వారసుడు విజయం అందుకుంటాడని ధీమాగా చెబుతున్నాడు రాజు. దసరా సందర్భంగా చాలా సైలెంట్ గా ఈ చిత్రాన్ని లాంఛ్ చేసారు.

More Related Stories