ఆ విషయంలో త్రివిక్రమ్ అవసరం లేదు అంటున్న దిల్ రాజు..Dil Raju
2019-11-26 22:48:42

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే  మాటల మాంత్రికుడు మరో సినిమాతో కూడా బిజీ కావాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా. దిల్ రాజు బోనికపూర్ నిర్మాతలుగా పింక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నారు.  వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.  అయితే ఇందులో హారిక హాసిని  బ్యానర్ కూడా భాగస్వామిగా ఉంటుందని ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. 

పవన్ కోసం మరోసారి ఈయన రచయితగా మారి పింక్ సినిమా తెలుగు రీమేక్ కోసం  స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిర్మాత దిల్ రాజుకు ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. తన ఆస్థాన దర్శకుడు, పింక్ రీమేక్ దర్శకుడు అయిన వేణు శ్రీరామ్ చేతనే స్క్రిప్ట్ వర్క్ చేయించాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితేనే తనకు కంఫర్ట్ గా వుంటుందని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయితే తనకు క్రియేటివ్ ఫ్రీడమ్ పోతుందని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ కూడా అల వైకుంఠపురంలో తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నాడు. దాంతో ఇప్పుడు పింక్ రీమేక్ బాధ్యత తీసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. దాంతో హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకుండా పవన్ కళ్యాణ్ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు. కాబట్టి ప్రస్తుతం అదే టెన్షన్ లో ఉన్నారు నిర్మాతలు దిల్ రాజు బోనికపూర్.

More Related Stories