దిల్ రాజు బ్యానర్ లో అడివి శేష్...ఎవడు కుదరకపోయినా !Dil Raju
2019-08-17 08:40:37

ఎక్కడో విదేశాలలో చదువుకుని ఉద్యోగం చేయకుండా సినిమాల మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చి కర్మ, కిస్ అంటూ సొంత ప్రయత్నాలు చేసి నిండా మునిగాడు అడివి శేష్, ఆ తర్వాత క్షణం, గూఢచారి, ఎవరు సినిమాల హిట్ కొట్టాడని అనుకుంటారు కొందరు. కానీ 2002లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాలో కూడా అడివి శేష్ ఉన్నాడని ఎంత  మందికి తెలుసు. అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం కష్టపడితే ఇప్పటికి మనోడికి లక్ దొరికింది. కిస్, కర్మ అనే సినిమాలు అడివి శేష్ అనేవాడు ఉన్నాడని తెలియచెబితే క్షణం సినిమా అతనిలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడని తెలిసేలా చేసింది. ఆ తర్వాత చేసిన గూఢచారి సినిమా శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా ఎవరు సినిమాతో అడివి శేష్ తానేంటో మళ్ళీ నిరూపించాడు. తాజాగా ఎవరు సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దిల్ రాజు అడివి శేష్ పై ప్రశంసలు కురిపించాడు. తనకు కథల జడ్జ్ మెంట్ ఉందని కాని ఇలాంటి ట్విస్టుల మీద మాత్రం అడివి శేష్ కు గ్రిప్ ఉందని అన్నాడు. ఇక త్వరలోనే మా బ్యానర్ లో అడివి శేష్ సినిమా చేస్తాడని దిల్ రాజు అన్నారు. అలాగే మిత్రుడు పీవీపీ బ్యానర్‌లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక శేష్ మాట్లాడుతూ సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయానని అన్నాడు. దిల్‌ రాజుగారి ఎవడు సినిమాలో మెయిన్‌ విలన్‌ గా చేయడానికి ప్రయత్నించానని, బహుశా అప్పటికి ఆ స్థాయిలో లేనేమోనని, కానీ ఇప్పుడు 'దిల్‌' రాజుగారే 'ఎవరు' సినిమా చూసి ఫోన్ చేసి సినిమా ఎప్పుడు చేస్తున్నామని అడగడం ఆనందంగా ఉందని అన్నారు.
 

More Related Stories