నాన్న నీ కొత్త జీవితం బాగుండాలి.. దిల్ రాజు కూతురు లేఖ.. Dil Raju
2020-05-12 00:34:08

అగ్ర నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి నిరాడంబరంగా జరిగింది. నిజామాబాద్ సమీపంలోని ఆయన కట్టించిన గుడిలోనే మే 10 రాత్రి 11.15 నిమిషాలకు వైఘా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసాడు దిల్ రాజు. ఈ పెళ్లికి చాలా తక్కువ మంది హాజరయ్యారు. అయితే రాజుగారి పెళ్లికి ఆయన కూతురు ఒప్పుకోలేదని చాలా రోజులు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాన్న పెళ్లి జరిగిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో రాసిన లేఖ ఒకటి బాగా వైరల్ అవుతుంది. నాన్న పెళ్లి తర్వాత హన్షితా చాలా ఎమోషనల్ అయిపోయింది. ప్రియమైన నాన్న.. నా అన్ని వేళల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు.. అండగా నిలబడ్డావు.. నువ్వే నాకు అతి పెద్ద బలం.. నువ్వు ఎప్పుడూ నాకు అండగా ఉంటూ వచ్చినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది. 

అంతేకాకుండా మన కుటుంబం సంతోషం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు.. మా సంతోషమే నీకు ముఖ్యంగా అనుకున్నావు.. జీవితంలో నువ్వు ప్రారంభించిన ఈ కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.. మీరిద్దరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.. ప్రతి రోజు మీకు అద్బుతంగా సాగాలంటూ ఆశిస్తూ ఉన్నాను.. ఐ లవ్ యూ అంటూ ఒక లేఖను రాసింది. వెనక తండ్రితో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది ఈమె. ప్రస్తుతం దిల్ రాజు కూతురు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అంతా ఎమోషనల్ అవుతున్నారు. తండ్రి సంతోషం కోసం హన్షితా చేసిన పనిని అంతా అభినందిస్తున్నారు కూడా. ఈ సందర్బంగా దిల్ రాజుకు టాలీవుడ్ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. మీ కొత్త జీవితం బాగుండాలని కోరుకుంటున్నట్లు అంతా ట్వీట్ చేస్తున్నారు. 

More Related Stories