వకీల్ సాబ్ లో.. పది నిమిషాలకు ఒక హైలైట్ : దిల్ రాజు



Dil Raju
2021-04-05 14:54:51

పవన్ కల్యాణ్ తో నిర్మించిన 'వకీల్ సాబ్' .. ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'దిల్ రాజు' మాట్లాడారు...మీకు ట్రైలర్ లాంచ్ రోజు చెప్పాను. ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అని, లంచ్ డిన్నర్ రిలీజ్ రోజు ఉంటది. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హైలైట్ ఉంటది. మీరు పేపర్స్ పట్టుకుని రెడీగా ఉండండి. పింక్ లోని కథను, పవన్ గారి ఇమేజ్ ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వేేణు సూపర్బ్ గా తెరకెక్కించారు. 

కళ్యాణ్ గారు ఓ చిన్న బ్రేక్ తీసుకుని తెరపైకి వస్తున్నారు. ఏప్రిల్ 9న మనమంతా పండగ చేసుకునేరోజు. కాలర్స్ ఎగరేసే రోజు అది. కళ్యాణ్ గారితో ఒక గొప్ప సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. మా ప్యాషన్ గురించి మీరు చెబుతుంటారు. చిన్న డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 50 సినిమాలు చేసే నిర్మాణ సంస్థగా ఎదిగాం. మీ ఎంకరేజ్ మెంట్ కు థాంక్స్. థమన్ ఒక పిచ్చోడిలా ఈ సినిమాకు పనిచేశాడు. నో కాంప్రమైజ్ అంటూ పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఇవాళ ఉదయం వరకు పనిచేస్తూనే ఉన్నాడు థమన్. పవన్ గారి ఇమేజ్ ను గుర్తుపెట్టుకుని మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ గారు దేవుడు. పవన్ గారితో నాకు పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఈ మధ్య పవన్ గారు పిలిచి మాట్లాడారు. ఆయన చెప్పిన రెండు మాటలు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మనసుతో ఆలోచించినప్పుడే అది అర్థమవుతుంది. అని చెమ్మగిల్లిన కళ్లతో అన్నారు.
 

More Related Stories