హీరోలందరికీ ఒకేసారి బిస్కెట్ వేసిన దర్శకుడు బాబి..bobby
2019-12-08 23:43:17

చేసింది మూడు సినిమాలే అయినా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు బాబీ. తొలి సినిమా పవర్ తోనే తనలో మంచి పవర్ ఉంది అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బాబీ కాస్త లయ తప్పాడు. కానీ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ సినిమా తెరకెక్కించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఈ కుర్ర దర్శకుడు. ఆ సినిమాలో ఏకంగా జూనియర్ తో త్రిపాత్రాభినయం చేయించి ఔరా అనిపించాడు. ఎందుకో తెలియదు కానీ జై లవకుశ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న దర్శకుడు బాబీ.. మళ్లీ ఇన్నాళ్లకు వెంకీమామ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అక్కినేని దగ్గుబాటి కుటుంబాలను కలుపుతూ అల్టిమేట్ మల్టీస్టారర్ తెరకెక్కించాడు బాబీ. అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వెంకటేష్ నాగచైతన్య కాంబినేషన్ కలిపాడు ఈయన. దానికి తోడు సొంత మేనల్లుడు మేనమామ సినిమా చేయడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి.

డిసెంబర్ 13 వెంకీమామ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు హీరోలందరికీ కలిపి ఈయన స్వీట్ బిస్కెట్ వేసాడు. తన స్పీచ్ మొదలు పెడుతూ అక్కినేని అభిమానులకు వెంకటేష్ అభిమానులకు నమస్కారం అని చెబుతూ.. వెంటనే మెగా అభిమానులకు ఘట్టమనేని మహేష్ అభిమానులకు నందమూరి అభిమానులకు.. ఇక్కడికి వచ్చిన ఇతర హీరోల అభిమానులకు నమస్కారం అంటూ అందరికీ కలిపి ఒకేసారి బిస్కెట్ వేసాడు బాబీ. దానికి వెంకటేష్ ఇమేజ్ జత చేశాడు. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకైనా నెగిటివ్ ఇమేజ్ ఉంటుందేమో కానీ వెంకటేష్ పై మాత్రం ఎలాంటి నెగిటివిటీ లేదు అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశాడు. ఏదేమైనా కూడా వెంకటేష్ ను మాత్రమే పడేయకుండా అభిమానులందరినీ తన బుట్టలో పడేలా చేసుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. వెంకీ మామ హిట్ అయితే బాబీ దశ తిరిగినట్లే

More Related Stories