పుష్ప కేజీఎఫ్ కు ప‌దిరెట్లు బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్Director Buchibabu
2021-06-14 16:55:51

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క‌రోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా మలయాళ నటుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు సుకుమార్ శిష్యుడు బుజ్జి బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ సినిమా తాను ఇప్ప‌టికే చూశానని పది కేజీఎఫ్ సినిమాల‌ తో సమానం అని అన్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. కేజీఎఫ్ సినిమా దేశ‌వ్యాప్తంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప‌ సినిమా కేజీఎఫ్ సినిమాకు ప‌ది రెట్లు ఉంటుందని చెప్పడంతో పుష్ఫ‌పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండ‌గా బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా విజ‌యంతో ప్ర‌స్తుతం ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 

More Related Stories