కొత్త బిజినెస్ లోకి మారుతిDirector Maruthi
2020-10-04 21:51:57

టాలీవుడ్ లో ప్రొడ్యూసర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన డైరెక్టర్ ల లిస్టులో ముందు వరుసలో ఉండే డైరెక్టర్ మారుతి అని చెప్పవచ్చు. ఎందుకంటే మారుతి చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ లో సినిమాలు పూర్తి చేసి హీరోకు మంచి హిట్ ఇవ్వడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేలా తీస్తాడు. మొదట్లో మారుతి తీసిన ఈ రోజుల్లో, బస్టాప్ మరికొన్ని చిత్రాల్లో బూతు కామెడీ ఉందని అందువల్లే హిట్ అవుతున్నాయి అని టాక్ వచ్చింది. దాంతో మారుతి నానితో బలే బలే మగవోడివోయ్ సినిమా తీసి నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళ నోర్లు మూయించాడు. ఇక డైరెక్టర్ గా సక్సెస్ అయ్యిన మారుతి ఆ తరవాత నిర్మాతగా మారి కూడా హిట్లు అందుకున్నాడు. 

ఇక ఇప్పుడు తాజాగా మారుతి వెబ్ సిరీస్ ను తెరకెక్కుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా తానే నిర్మాత గా కూడా వ్యవహరించనున్నారట. అల్లు వారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం ఈ వెబ్ సిరీస్ ను తీయనున్నారట. యూత్ ఫుల్ హ్యూమర్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా మారుతి గీత ఆర్ట్స్ బ్యానర్ పై రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

More Related Stories