ఒకేసారి ప్రభాస్, చైతూ సినిమాలని లైన్ లో పెట్టిన పరశురామ్pra
2019-11-24 03:06:35

గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు పరశురామ్ గీతా గోవిందం  విడుదలై ఏడాది దాటేసినా పరశురామ్‌ నుంచి కొత్త సినిమా అప్డేట్ ఏమీ రాలేదు. ఆయన మహేష్ తో సినిమా చేస్తాడని ఒకసారి అఖిల్ తో సినిమా చేస్తాడని ఒకసారి ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఇక తాజాగా మరో ప్రచారం మొదలయింది. అదేంటంటే పరశురామ్ ప్రభాస్ కోసం ఫ్యామిలీ ఎంటర్ టైన్ కథను సిద్ధం చేసి ఇప్పటికే ప్రభాస్ కు వినిపించాడట…ఈ మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జాన్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగనుంది ఆ తర్వాతే పరశురామ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
అయితే ఈ గ్యాప్ లో నాగ చైతన్యతో ఒక మూవీ చేసేందుకు కూడా పరశురామ్ అంతా సిద్దం చేసుకుంటున్నారట. చైతు నటిస్తున్న వెంకీ మామ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమాల తర్వాత పరశురామ్ దర్శకత్వంలో చైతూ నటించేందుకు సిద్దమవుతున్నాడని అంటున్నారు. ప్రభాస్‌ కోసం చాలా మంది దర్శకులు వేచి చూస్తున్నారు కాబట్టి, ఆయనతో పరశురామ్ సినిమా వెంటనే ఉంటుందా లేదా లేట్ అవుతుందా అన్నదాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

More Related Stories