రాజమౌళిని ఘోరంగా అవమానించిన యంగ్ డైరెక్టర్..Prashanth Kumar
2020-04-24 18:41:10

రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు తెలుగులోనే కాదు ఇండియాలోనే మార్మోగిపోతుంది. తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో ప్రపంచ యవనికపై నిలబెట్టాడు దర్శక ధీరుడు. ఈయన్ని ఒక్కమాట అనాలంటే కూడా ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. తన పని తాను చేసుకుంటూ.. తన సినిమాల గురించి ఎప్పుడూ తపన పడుతూనే ఉంటాడు రాజమౌళి. అలాంటి దర్శకుడిని వేలెత్తి చూపించాలంటే కూడా భయపడుతుంటారు. వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి.. ఈ మధ్యే ఆస్కార్ విన్నింగ్ సినిమా పారాసైట్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ సినిమాను చూస్తుంటే తనకు నిద్ర వచ్చేసిందని.. అసలు తనకు నచ్చలేదని.. ఎక్కలేదని చెప్పాడు. దాంతో వివాదం రాజుకుంది. అయితే తనకు నచ్చకపోయినంత మాత్రానా అది గొప్ప సినిమా కాకుండాపోదని చెప్పాడు రాజమౌళి. అయితే దీనిపై ఇప్పుడు తెలుగులో ఒకేఒక్క సినిమా తీసిన దర్శకుడు ప్రశాంత్ కుమార్ సంచలన లేఖ రాసాడు. 

రాజమౌళిని దారుణంగా విమర్శిస్తూ ఈయన ట్వీట్ చేసాడు. మిఠాయి సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కుమార్.. రాజమౌళిని టార్గెట్ చేసాడు. పారాసైట్ అనేది అద్భుతమైన ఒరిజినాలిటీ ఉన్న సినిమా.. దీన్ని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు కూడా ప్రశింసించారు.. సినిమా అనే అడ్డుగోడలు కూల్చేసింది ఇది.. కానీ బాహుబలిని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని.. చూడలేదని.. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేసారు.. మరికొన్ని సినిమాలు కూడా కాపీలే.. అద్భుతమైన పారాసైట్ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం మీకు తగదు అంటూ ప్రశాంత్ కుమార్ విమర్శించాడు. 

More Related Stories