అరెస్ట్ వారెంట్ వార్తలపై దర్శకుడు శంకర్‌ షాక్‌..Director Shankar
2021-02-02 16:06:36

గౌరవనీయ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే తప్పుడు వార్తలను చూసి తాను షాక్ కి గుయ్యానని శంకర్ తాజాగా పత్రికా ముఖంగా ప్రకటన జారీ చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.  అందులో 'ఎగ్మూర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు నాకు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసిందనే వార్తలు చూడగానే షాక్‌కు గురయ్యా. వెంటనే మా లాయర్‌ సాయికుమారన్‌ ఈ విషయంపై కోర్టును ఆశ్రయించారు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి ఎటువంటి వారెంట్‌ జారీ చేయలేదని తెలిపారు. ఆన్‌లైన్‌ కోర్టు రిపోర్టింగ్‌లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఆ నోటీసు జారీ అయినట్లు వివరించారు. వెంటనే దాన్ని సరిచేశారు. అయినా పూర్తి సమాచారాన్ని ధ్రువపరుచుకోకుండా ఒకరిపై తప్పుగా వార్తలు రాయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ వార్తలు నా బంధువులు, స్నేహితులను కలవరపాటుకు గురిచేశాయి. దయచేసి ఇకపై ఇలాంటి విషయాల్లో తొందరపడకుండా, పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాస్తారని ఆశిస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు.

More Related Stories