డైరెక్టర్ శంకర్ కు మాతృవియోగం



Director Shankar
2021-05-19 09:36:41

దర్శకుడు శంకర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈయన తల్లి గారు ముత్తులక్ష్మి కన్నుమూసారు.చెన్నైలోని స్వగృహంలోనే ముత్తులక్ష్మి కన్నుమూసారు. శంకర్ అమ్మగారు చనిపోయిన విషయం తెలియగానే తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించారు. శంకర్‌తో పని చేసిన హీరోలు, నిర్మాతలు వరసగా  ఆయన్ని ఫోన్‌లోనే పరామర్శిస్తున్నారు.ఆమె మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు ఈయన. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాకు కమిటయ్యాడు శంకర్. 

More Related Stories