జక్కన్నను చూసి జపానోళ్ళు ఎలా సంబరపడుతున్నాడో చూడండిdir
2019-10-20 20:21:14

బాహుబలి సిరీస్‌ సినిమాలతో భారతీయ చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి దానిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బాహుబలి సిరీస్ సినిమాలతో జక్కన్నకు విదేశాల్లో కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. అన్ని దేశాల వాళ్ళ సంగతి పక్కన పెడితే జపనీస్ వారిలో ఆయనకున్న క్రేజ్‌ మరింత ప్రత్యేకం. ‘బాహుబలి’ సిరీస్ కి జపాన్‌ వాసులు ఎంతగా ముగ్దులైపోయారంటే అందులోని హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు నటీనటులు, దర్శక,నిర్మాతలు ఎవరు పుట్టినరోజులు వచ్చినా అక్కడి నుంచి ఇక్కడికి కుప్పలు తెప్పలుగా గ్రీటింగ్స్‌ సహా గిఫ్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. జపాన్ కానీ అక్కడి వారున్న చోటుకు కానీ ఈ సినిమాకి సంబందించిన వాళ్ళు వెళ్తున్నారంటే చాలు వారిని చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చేస్తున్నారు.

తాజాగా ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమాని లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించారు. అంతే కాక సినిమా జరుగుతున్నంత సేపూ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి నేతృత్వంలో లైవ్ సంగీత ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభాస్‌, రానా, అనుష్క, రాజమౌళి ఇతర చిత్ర బృందంతో పాటు పలువురు సినీప్రియులు అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమం ముగిశాక రాజమౌళి బయటకు రాగా పలువురు జపనీస్ మహిళలు ఆయన్ని చూసి రోడ్డుపైనే చిన్నపిల్లల్లా సంబర పడిపోయారు. ఆయనతో ముచ్చటిస్తూ ఆనందంలో మునిగిపోయి ఆర్ఆర్ఆర్ సినిమా గున్రించి కూడా ఆరా తీశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ‘బాహుబలి’ బృందం ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  

 

The name is #SSRajamouli!🔥 Excited #Baahubali lovers from Japan who came to watch the show at the #royalalberthall had quite the fan moment with our director outside the hotel in London... #Rajamouli #Prabhas #Aanushka #RRR pic.twitter.com/CMht7wn3CJ

— Strikers Entertainment (@Strikersent_) October 20, 2019

 

 

More Related Stories