స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్న సుకుమార్..sukumar
2020-03-30 06:50:55

తనకి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ కోల్పోయారు. ఈ షాకింగ్ న్యూస్ విన్న సుకుమార్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌.. సుకుమార్ స్నేహితుడు, మేనేజరే కాకుండా ‘అమరం అఖిలం ప్రేమ’ అనే చిత్రానికి నిర్మాత కూడా. సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ఈ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఒకరు. మార్చి 28 మధ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. సుకుమార్ ప్రసాద్ ఒకే ఊరు నుంచి వచ్చారు. గ్రామం నుంచి ఇద్దరు స్నేహితులు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ప్రతి విషయంలోనూ సుకుమార్ కు ప్రసాద్ చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన నిర్మించిన అమరం అఖిలం ప్రేమ ఈవెంట్ కు కూడా సుకుమార్ వచ్చాడు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఎప్పుడు డిజప్పాయింట్‌కి లోనైనా.. తన మిత్రుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌తో మాట్లాడితే మళ్లీ ఎనర్జీ వచ్చేదని, అంతగా తన లైఫ్‌లో వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ పాత్ర పోషించారని సుకుమార్ తెలియజేశారు. ఆయన మరణం తనకి ఎంతో లోటని, తనకి సంబంధించి ఎవ్వరూ తన ప్లేస్‌ని రీప్లేస్ చేయలేరని తెలుపుతూ.. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సుకుమార్ తెలియజేశారు.

More Related Stories