ప్రభాస్ కధతో వరుణ్ హీరోగా సురేందర్ రెడ్డి సినిమాSurender Reddy Prabhas.jpg
2019-11-07 09:35:00

దర్శకుడు సురేందర్‌ రెడ్డి సైరా తర్వాత ఏ సినిమాకి ఇంకా కమిటవ్వలేదు. ఆయన తర్వాత సినిమా ఇదే అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభాస్‌, మహేష్‌తో సినిమాలు వుండవచ్చునని ప్రచారం జరిగింది. అలాగే ప్రభాస్ తో ఆయన మరో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడని అన్నారు. అయితే ప్రభాస్ సినిమా చేద్దాం కానీ మరో సంవత్సరం ఆగాలని అన్నారట.

అందుకే అంత సేపు ఆగడం ఇష్టం లేక ప్రభాస్ స్థానంలో వరుణ్ తేజ తో ముందుకు వెళ్ళాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే అలా కాకుండా సురేందర్‌ త్వరలోనే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడని వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా ఓ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. కథ సురేందర్ రెడ్డి అందిస్తుండగా తన దగ్గర పనిచేసిన వ్యక్తిని ఈ సినిమా ద్వారా దర్శకుడిని కూడా చేస్తున్నాడట. మరో ప్రక్క వరుణ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటితో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అనుకున్నవి అనుకున్నట్లు సెట్ జరిగితే త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

More Related Stories