రోడ్డు ప్రమాదం..ప్రముఖ దర్శకుడికి గాయాలుaccident
2020-01-26 14:45:51

స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ సినిమాకి పని చేసిన ఒక అసిస్టంట్ డైరెక్టర్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తృటిలో ప్రాణాపాయం నుండి త‌ప్పించుకున్నాడు. ఈ సంఘ‌ట‌న గడిచి రెండు రోజులు కూడా గడవక ముందే త‌మిళ ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ ఒక ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. ఆయన ఉదయాన్నే వాకింగ్‌కి వెళుతుండ‌గా బైక్‌పై వ‌చ్చిన ఓ వ్య‌క్తి చూసుకోకుండా సుశీంద్ర‌న్‌ని బ‌లంగా ఢీకొట్టారు. దీంతో కింద‌ప‌డ్డ సుశీంద్రన్ కి తీవ్ర గాయాల‌య్యాయి. దీన్తి ఆయనను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించిన స్థానికులు చికిత్స చేయించారు. సుశీంద్ర‌న్ యాక్సిడెంట్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. సుశీంద్ర‌న్‌ని ప‌రీక్షించిన వైద్యులు ఆయన చేయి విరిగింద‌ని చెప్పారు. శ‌రీరంలో మిగ‌తా భాగాలకి తీవ్ర‌గాయాలు అయిన నేప‌థ్యంలో ఆయనను వారం రోజుల పాటు  ఆసుప‌త్రిలో ఉంచి చికిత్స అందించ‌నున్న‌ట్టు వైద్యులు తెలిపారు. సుశీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో తమిళ సినిమాలు రూపొందాయి. ఇక ఆయన సందీప్ కిషన్ తో కేరాఫ్ సూర్య సినిమాని తెలుగు తమిళ్ లో బై లింగ్యుయాల్ సినిమాగా తెరకెక్కించారు.

More Related Stories