టాలీవుడ్‌లో కరోనా కలకలం.. దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్  Teja
2020-08-03 23:38:23

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి  ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్‌కి క‌రోనా సోకింది.   ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. గత వారం వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేశారు తేజ. దీంతో ఆయ‌న‌తో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు చేశారు వైద్యులు. ఈ రిపోర్టుల్లో తేజ‌కు త‌ప్ప మిగ‌తావారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది. కాగా ప్ర‌స్తుతం తేజ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం గోపీచంద్, రానా హీరోలుగా రెండు సినిమాలు అనౌన్స్ చేసాడు. కరోనా తగ్గిన తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలు పెట్టనున్నాడు తేజ.

More Related Stories