వినాయక్ అదిరిపోయాడుగా.. మాస్ హీరోగా మారిన దర్శకుడు..vv
2019-10-06 04:41:31

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రాజమౌళి తర్వాత ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుడు వివి వినాయక్. ఈయన పేరు చెబితే చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని రోజులుగా మనోడి టైమ్ అస్సలు బాలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇక చిన్న హీరోలు సైతం వినాయక్ అంటే ఎందుకు రిస్క్ అనుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ఇంటెలిజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో వినాయక్ పై పూర్తిగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయిన కూడా ఇప్పటివరకు వినాయక్ మరో సినిమా మొదలు పెట్టలేదు. బాలకృష్ణతో సినిమా ఓకే అయినా ఆయన మాత్రం పట్టించుకోనట్లు ఉన్నాడు. దాంతో ప్రస్తుతం దర్శకుడి నుంచి నటుడిగా మారిపోయాడు ఈ దర్శకుడు.

శ్రీనివాసరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నాడు వినాయక్. ఈ సినిమా కోసమే ఇప్పుడు లుక్ కూడా మార్చేసాడు ఈయన. ఇప్పుడు విడుదలైన వినాయక్ స్టిల్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అంతగా మారిపోయాడు వినయ్. ఇది పూర్తయిన తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నాడు ఈయన. తనకు అచ్చొచ్చిన హీరోతోనే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. పదేళ్ల కింద కృష్ణ అంటూ నానా రచ్చ చేసిన రవితేజతోనే వినాయక్ ఇప్పుడు ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. ఆయనకు కూడా హిట్ కొట్టడం కీలకం. ఇలాంటి సమయంలో వినాయక్ తో సినిమా చేయడం అంత మంచిది కాదు అంటున్నారు ఆయన అభిమానులు. వినాయక్ టేకింగ్ గురించి రవితేజ కు ఒక ఐడియా ఉంది. మంచి కథ దొరికితే ఖచ్చితంగా బాక్సాఫీసు బద్దలు కొడతాడు అని నమ్ముతున్నాడు మాస్ రాజా. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు రాబోతుందో చూడాలి. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు.

More Related Stories