రేస్ నుంచి రవితేజ కావాలనే తప్పుకున్నాడా..Disco Raja
2019-12-07 13:02:56

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. విఐ ఆనంద్ దర్శకుడు. తాజాగా విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయడానికి ముందు నుంచి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు టీజర్ లో మాత్రం జనవరి 24 అని డేట్ మార్చేసారు దర్శక నిర్మాతలు. దీని వెనుక అసలు కారణం బాలకృష్ణ అని ప్రచారం జరుగుతోంది. 

డిసెంబర్ 20న బాలయ్య నటించిన రూలర్ సినిమా విడుదల కానుంది. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జై సింహా లాంటి విజయం తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక డిసెంబర్ 20న సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండగే కూడా విడుదల కానుంది. ఒకే రోజు రెండు పేజీ సినిమాలు రావడంతో రవితేజ తనంతటతానే రేసు నుంచి బయటికి వచ్చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానికితోడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండటంతో హడావిడిగా పూర్తిచేసి విడుదల చేసేకంటే క్వాలిటీ అవుట్ పుట్ తో రావాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే నెల రోజులు ఆలస్యంగా ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. 

జనవరి 24న అయితే డిస్కో రాజాకు సోలో రిలీజ్ డేట్ దొరుకుతుంది. అందుకే అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు మాస్ రాజా. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించాడు. వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రిస్కు తీసుకోకూడదని సింపుల్ గా సోలో రిలీజ్ వైపు అడుగులు వేసాడు రవితేజ.

More Related Stories