బావ చెల్లితో వరుణ్ తేజ్ దీపావళి సెలబ్రేషన్స్ VarunTej
2020-11-16 11:53:13

గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య తో నాగబాబు కుమార్తె నిహారికకు ఆగస్టు నెలలో నిచితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ నిచ్చితార్ధం అతి కొద్దిమంది దగ్గరి బంధువుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ పెళ్ళి ముహుర్తాన్ని నిర్చయించుకున్నారు. కాగా ఐజీ  ప్రభాకర్ పెళ్లి ముహూర్తం వివరాలు తెలియచేసారు .ఆ వివరాల  ప్రకారం డిసెంబర్ 9,రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తము ఖరారు చేసినట్టు తెలిపారు. 

పెళ్లి వేడుక రాజస్థాన్ లో ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ లో జరగనుంది. ఇదిలా ఉండగా పెళ్లి కి సంబందించిన అన్ని పనులని వరుణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. వరుణ్ పెళ్లి పనుల కారణంగా కొంత కాలం షూటింగ్ లకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వరుణ్ దీపావళి వేడుకను తన బావ, చెల్లి తో కలిసి సరదాగా జరువుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో  వరుణ్ మరియు నిహారిక నలుపు దుస్తులు ధరించారు. చైతన్య పింక్ కలర్ షర్ట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

More Related Stories