దసరా బరిలో వెంకీ దృశ్యం 2.?Drushyam 2 movie will release at dasara
2021-09-16 05:08:11

దసరా పండుగకి దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ కాకపోతే నందమూరి నటసింహం - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న అఖండ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

అయితే.. దసరాకి అఖండ విడుదల కావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. అందుచేత దసరాకి వెంకీ దృశ్యం 2 చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట సురేష్‌ బాబు. ఈ నెలాఖరుకు ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని సమాచారం. ఇందులో వెంకీ సరసన మీనా నటించింది. మలయాళంలో విజయం సాధించిన దృశ్యం 2 చిత్రానికి రీమేక్ ఇది. జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళంలో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. మరి.. తెలుగులో దృశ్యం 2కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

More Related Stories