రిపోర్టర్ మీద బాడీ షేమింగ్..సారీ చెప్పిన హీరోDulquer Salmaan
2020-04-23 17:06:56

ప్రస్తుతం బాడీ షేమింగ్‌ అనేది సర్వ సాధారణం అయింది. అయితే ఈ విషయాన్ని చాలా మంది లైట్ తీసుకుంటుంటే మరికొంత మంది ఏమో చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. తమ శరీరం గురించి వెకిలి వ్యాఖ్యలు చేసే హక్కు వేరే వ్యక్తికి లేదని వారంటున్నారు. అలానే హీరో దుల్కర్ సల్మాన్ నటించిన `వారనె అవశ్యముండ్` సినిమాలో ఇలా ఒక బరువు తగ్గమని ఇచ్చే పోస్టర్ ల్ తన ఫోటో వాడారని ముంబైకి చెందిన రిపోర్టర్ చేతనా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన ఫొటోను అవమానకరంగా ఉపయోగించారని, అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని, సినిమా నుంచి తన ఫొటోను తొలగించాలని లేదా బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ చేతన ట్వీట్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు కూడా. 

దీంతో దుల్కర్ సల్మాన్ వెంటనే హుందాగా స్పందించాడు. `దీనికి మేం పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో నేను తెలసుకుంటాను. మీ ఫొటోను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనుక్కుంటాను. నా తరఫున, మా సినిమా యూనిట్ తరఫున నేను క్షమాపణలు చెబతున్నాను` అని దుల్కర్ ట్వీట్ చేశారు. మరో పక్క దర్శకుడు కూడా  చేతనకు క్షమాపణలు చెప్పాడు. ఇక ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తప్పు అని సినిమా గురించి కొంత అవగాహన ఉన్నవారికి అర్ధం అవుతుంది. అయినా హీరోనే స్వయంగా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమనిగినట్టే.

More Related Stories