దర్బార్ సర్ప్రైజ్...ఇక్కడ మహేష్...మరి చిరంజీవిChiranjeevi Mahesh Babu.jpg
2019-11-07 10:57:59

రజినీ కాంత్ కొత్త సినిమా దర్బార్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సంక్రాంతి రిలీజ్ అనుకుంతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది యూనిట్. అయితే నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ నవంబర్ 7వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దర్బార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

నిజానికి తెలుగు తమిళ్ మోషన్ పోస్టర్స్ ను కమల్ హాసన్ రిలీజ్ చేస్తారని మలయాళం మోషన్ పోస్టర్ ను మోహన్ లాల్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తారని హిందీ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారని నిన్న ప్రకటించారు. కానీ ఈరోజు తెలుగు వారికి సర్ప్రైజ్ ఇస్తూ ఆ మోషన్ పోస్టర్ ను మహేష్ బాబు రిలీజ్ చేస్తారని ప్రకటించారు. నిజానికి హిందీలో దర్బార్ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ రిలీజ్ చేస్తున్నాడు. తమిళ్ లో కమల్ హాసన్ రిలీజ్ చేయబోతున్నాడు. ఈ లెక్కన తెలుగులో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలంటే అది చిరంజీవి మాత్రమే అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా తెలుగు మోషన్ పోస్టర్ ను మహేష్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు.

అయితే మురగదాస్ మహేష్ మధ్య ఉన్న సంబందాల దృష్ట్యా మహేష్ ని అడిగితే ఓకే చేశాడని అందుకే ఈ దీనికి చిరుని దూరం పెట్టారని అంటున్నారు. అంతే కానీ చిరును తక్కువ చేసే ఉద్దేశం లేదని అంటున్నారు.

More Related Stories