ఇషారెబ్బా.. స్విమ్ సూట్లో ఏముంద‌బ్బా..!Eesa Rebba In Swim Shoot
2018-05-31 11:21:51

అవును.. ఇప్పుడు తెలుగ‌మ్మాయిలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ఈ లిస్ట్ లోకి ఇషారెబ్బా కూడా వ‌చ్చి చేరిపోయింది. ఇన్నాళ్లూ కాస్త ప‌ద్ద‌తి గానే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్విమ్ సూట్ వ‌ర‌కు వ‌చ్చేసింది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఈ ముద్దుగుమ్మ హొయ‌లు పోయింది. అది సినిమా కోస‌మా లేదంటే ప‌ర్స‌న‌ల్ ఫోటోస్ అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ అమ్మాయిగారు మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనే అందాల‌న్నీ పంచి అభిమానుల్ని కూడా ఆనందింపచేస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మాత్రం అనుకున్నంత‌గా అవ‌కాశాలు మాత్రం ఈషా త‌లుపు త‌ట్ట‌లేదు. ఆ త‌ర్వాత మ‌రోసారి ఇంద్ర‌గంటే బందిపోటులో న‌రేష్ తో న‌టించే ఛాన్సిచ్చారు. కానీ అది డిజాస్ట‌ర్. త‌ర్వాత మ‌ళ్లీ ఇంద్ర‌గంటి అమీతుమీతో హిట్ కొట్టింది.

తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేసింది ఈషా. ఇక్క‌డ అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఈ మ‌ధ్యే నాని నిర్మించిన అ.. సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది ఇషారెబ్బా. ఆ సినిమా ప‌ర్లేద‌నిపించింది. ఇప్పుడు సుమంత్ హీరోగా ఓ సినిమాలో న‌టిస్తుంది ఇషా. ఇక ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్- ఎన్టీఆర్ సినిమాలోనూ ఆఫ‌ర్ అందుకుంది ఇషా. ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఇక ఇంకా ఆఫ‌ర్లు రావాలంటే అందాలు ఆర‌బోయక త‌ప్ప‌ద‌ని తెలుసుకుని.. ఇలా చిన్న క్యాస్ట్యూమ్ లో అందాలు ఆర‌బోస్తుంది ఈ భామ‌. ఇది చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు ఆఫ‌ర్లు ఇవ్వ‌క పోతారా అని ఆశ‌. మ‌రి ఈషా కెరీర్ కు ద‌ర్శ‌కుడు అయినా హెల్ప్ చేస్తాడా..?

More Related Stories