బిగ్ బాస్ ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ...ఆ హీరోయినా ? Eesha Rebba
2019-08-24 11:02:16

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 రసవత్త్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో వారం కూడా రేపటితో పూర్తి చేసుకోనుంది. అయితే రేపటి రోజున ఎలిమినేషన్ తో  పాటుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ  గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇంటి నుండి హేమ నిష్క్రమించిన తరువాత, హీరోయిన్ శ్రద్ధా దాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి ప్రవేశించబోతున్నారని ప్రచారం జరిగింది. అందరూ అదే నిజమని భావించారు, కాని అనూహ్యంగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హౌస్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇంటి నుండి మరో పోటీదారయిన జాఫర్  నిష్క్రమించిన తరువాత అలాగే మొన్న ఎలిమినేట్ అయిన  పోటీదారు రోహిణి హౌస్ నుండి వెళ్ళాక మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోందని ప్రచారం జరిగింది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో హెబ్బ పటేల్ అలాగే చాలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం కాని బిగ్ బాస్ నిర్వాహకులు షో మీద మరింత క్రేజ్ పెంచేందుకు తెలుగు మాట్లాడే ఒక ప్రముఖ హీరోయిన్ ని లోపలికి పంపిస్తున్నారని చెబుతున్నారు. అయితే తెలుగమ్మాయి అయిన హీరోయిన్ ఈషా రెబ్బా ఇంట్లోకి ప్రవేశించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఆమె మంచి ప్రతిభ గల నటి అయినప్పటికీ, ఆమెకు పెద్ద ఆఫర్లు రాలేదు. ఎన్టీఆర్ లాంటి హీరో సరసన నటించినా ఆమె లైం లైట్ లోకి అయితే రాలేదు ఈ క్రమంలో ఆమె మళ్ళీ రంగంలోకి దిగాలని భావిస్తోందని దానికి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ క్రేజ్ వాడుకోవాలని చూస్తోందని చెబుతున్నారు.  

More Related Stories