ఏక్ మినీ కథ నుంచి సామిరంగా సాంగ్ రిలీజ్ 



Ek Mini Katha
2021-04-21 12:17:24

'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించారు. కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ స్టోరీ అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా వారు సమర్పిస్తున్నారు. 

శ్రీరామనవమి సందర్భంగా తాజాగా సెకండ్ సాంగ్ 'సామిరంగా..' లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.  'సామి రంగా.. పరేషానీ జీవితం.. తస్సాదియ్యా.. ఊరుకోరే ఈ జనం.. పిల్లకన్నీ పెద్ద కలలే.. చిన్నబోయా నాలోనేనే..' అంటూ సాగిన ఈ పాటకు ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ కంపోజ్ చేశారు. సినిమా నేపథ్యానికి తగ్గట్లు లిరిసిస్ట్ శ్రీజో సాహిత్యం అందించగా.. సింగర్ పృథ్వీ చంద్ర తనదైన శైలిలో అలపించారు.

More Related Stories