జక్కన్నకి ఆ భామ కూడా హ్యాండ్ ఇచ్చిందా ?Emma Roberts
2019-07-29 08:38:01

ఆర్ఆర్ఆర్ సినిమాకి అస్సలు కాలం కలసి రావడం లేదు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టారో కానీ అన్నీ ఆటంకాలే, ఒకసారి గాయాలు, మరోసారి ప్రకృతి, ఇలా ఏదో ఒకరకంగా షూట్ కి అడ్డంకులు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాల మీద యూనిట్ ఎప్పుడూ ఖండించకపోవడంతో అదే నిజమని అందరూ నమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్ర పోషిస్తోన్న ఎన్టీఆర్ సరసన ఒక ఫారెన్  బ్యూటీ హీరోయిన్‌గా నటించాలి. అయితే ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఈ పాత్ర కోసం డైసీ ఎడ్గర్ జోన్స్ పేరును రాజమౌళి ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీదనే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ అప్పుడే ఈ భామ కూడా జక్కన్న కి హ్యాండ్ ఇచ్చిందని ప్రచారం మొదలయ్యింది. ఎందుకంటే ఆమె ఒప్పుకున్న ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉందట. అయితే ఆమెకి ఉన్న వేరే కమిట్మెంట్స్ వలన ఆమె అన్ని డేట్స్ ఇవ్వలేక ప్రాజెక్ట్ లో భాగం కాకముందే తప్పుకున్నట్లు చెబుతున్నారు. దీంతో రాజమౌళి మరో ఫారెన్ నటి కోసం వెదుకులాట మొదలుపెట్టారని అంటున్నారు. 

More Related Stories