ఆర్య ఎనిమి ఫస్ట్ లుక్..Enemy
2021-02-05 00:27:41

తమిళ హీరోలు ఆర్య, విశాల్ కలిసి నటిస్తున్న సినిమా "ఎనిమి". దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆర్య లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చేతికి సంకెళ్లతో.. ముఖానికి తగిలిన దెబ్బలతో కోపంగా చూస్తున్న ఆర్య లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విశాల్, ఆర్య ఇదివరకే ఓ సినిమాలో కలిసి నటించారు. బాల డైరెక్షన్ లో ఈ ఇద్దరు హీరోలు "వాడు వీడు" సినిమాలో నటించి మెప్పించారు. ఇక ఈసారి ఏమేరకు అలరిస్తారో చూడాలి.

More Related Stories