ఎంత మంచివాడవురా టీజర్.. రాముడు మంచోడే కానీ..  Entha Manchivaadavuraa Teaser
2019-10-09 13:10:58

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు శ్రీనివాస కళ్యాణం సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా ఎందుకో కానీ సతీష్ సినిమాలపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఓ వైపు కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు అంతా ఒక్కొక్కరుగా ఆయన్ని మంచివాడు అని చెప్తుంటే.. ఇక్కడ ఈయన మాత్రం విలన్స్ తో రప్ఫాడుకుంటాడు. మంచివాడు అని చెప్పిన ప్రతీసారి ఓ షాట్ పడుతుంటుంది. ఆసక్తికరంగా.. కొత్తగా అనిపించింది ఈ టీజర్. అక్కడే ఓ డైలాగ్ కూడా ఉంది. అందరు మంచివాడు మంచి వాడు అంటుంటే.. నువ్వెంట్రా అలా కొడుతున్నావ్ అని అడిగిన వెంటనే.. రాముడు కూడా మంచివాడేరా.. కానీ రావణాసురుడిని వేసేయ్ లా అని చెప్పడంతో టీజర్ ముగుస్తుంది. చెడ్డకు చెడు.. మంచికి మంచి అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నాడు సతీష్. మళ్లీ ఎప్పుడు వస్తావ్ రా అంటూ తణికెళ్ల భరణి అడిగిన వెంటనే సంక్రాంతికి నాన్న అని చెప్పడం వెనుక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. మొత్తానికి టీజర్ చాలా బాగా కట్ చేసాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

More Related Stories