కంగన కోసం హైదరాబాద్ లో స్టూడియో బుక్ Kangana Ranaut
2020-10-12 13:19:44

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తోంది. ఈ సినిమాకు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే కంగనా రనౌత్ వర్సెస్ మహా సర్కార్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె  తనకు వై కేటగిరీ భద్రత కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆమె కొరికమేరకు ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కల్పించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కంగనా షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఇప్పుడు కంగనా కోసం నిర్మాతలు సారథి స్టూడియోస్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారట. షూటింగ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ నిర్ణయం తీసుకున్నారట. స్టూడియోస్ లో దర్శకుడు విజయ్ తో పాటు అతడి భార్య, కంగనా ఉంటున్నారు. సినిమా కోసం రెండు వారాలపాటు కంగనా హైదరాబాద్ లోనే ఉండనుంది. అంతే కాకుండా ప్రస్తుతం కమెడియన్ అలీ పై ఓ కీలక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు.

More Related Stories