అనిల్‌ రావిపూడి F3 మొదలు.. 23 నుండి రెగ్యులర్ షూటింగ్F3 Movie
2020-12-17 13:55:25

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా గత సంవత్సరం విడుదలైన 'F2' ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌ తేజ్‌కి జోడీగా మెహరీన్‌ నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ  ‘ఎఫ్‌ 3’ని ప్రకటించారు.  ఈ సీక్వెల్‌కు సంబందించి ఈ ఉదయం షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్నామని తెలిపింది చిత్రబృందం. ఈ సందర్బంగా తమ వద్ద మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉందని, మరింత వినోదానికి సిద్ధంగా ఉండాలని పేర్కోన్నారు దర్శక నిర్మాతలు.ఇక ముహూర్తపు షాట్ ను వరుణ్ తేజ్, తమన్నాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు.ఈ పూజా కార్యక్రమంలో హీరో వరుణ్, తమన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు పాల్గోన్నారు. మరి సెకండ్ హీరోయిన్ గా మెహ్రీన్ కంటిన్యూ అవ్వబోతుందా లేదంటే ఆమె స్థానంలో మరెవ్వరైనా రాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

More Related Stories