విడుదలకు ముందే F3 రికార్డులు..ప్రీరిలీజ్ బిసినెస్ ఎంతంటే



 F3 Pre Release
2021-01-30 17:21:00

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ "ఎఫ్2". ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సినిమాలో వెంకీకి జోడిగా తమన్నా..వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటించి అలరించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా థియేటర్లో నవ్వులు పూయించింది. సినిమాలో కావాల్సినంత కామెడీ ఉండటంతో వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు కొనసాగింపుగా ఎఫ్-3 సినిమాను కూడా అనిల్ రావిపూడి పట్టాలెక్కించారు. 

అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉండబోతున్నారని ముందు నుండి గాసిప్స్ వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని సినిమాలో ఇద్దరు హీరోలే నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఎఫ్2 లో పెళ్లి తరవాత వచ్చే ఫ్రస్టేషన్స్ ఎలా ఉంటాయో చూపించిన దర్శకుడు...ఎఫ్3 లో మనీ వల్ల వచ్చే ఫ్రస్టేషన్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో సినిమా విడుదల కు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. సినిమా సాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ రూ.12 కోట్లకు కొనగా...సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రూ.12 కోట్లకు సొంతం చేసుకుంది.

More Related Stories