రాశిఖన్నా మీద విరుచుకుపడుతున్న ఫ్యాన్స్rasi
2020-01-06 11:57:54

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రాశిఖన్నా అనే చెప్పాలి. వరుస సినిమా ఛాన్సులు ఆమెకు ఎనలేని క్రేజ్ ని తెచ్చిపెడుతున్నాయి. మొన్న డిసెంబర్ లో వెంకిమామ తో సూపర్ హిట్ అందుకున్న రాశి..తాజాగా ప్రతి రోజు పండగే తో మరో సూపర్ హిట్ ను కొట్టి వార్తల్లో నిలిచింది. మరి ఎన్నాళ్లని సాంప్రదాయ సినిమాలు చేస్తూ ఓకే రకమైన పాత్రలు చేస్తాం అనుకుందో ఏమో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజర్ లో అసలు ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయనంత గ్లామర్ అండ్ బోల్డ్ గా కనిపించి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో మిగతా హీరోయిన్లు ఆల్రెడీ గ్లామర్ హీరోయిన్లుగా పేరు పడ్డ వారే. వారితో పోటీ పాడేందుకు ఆమె కూడా కాస్త బోల్డ్ గానే నటించింది. ఇక టీజర్ లో రాశి బోల్డ్ గా నటించడం ఫై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు ఎందుకొచ్చిన ఖర్మ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ సినిమాలో రాశీ పోషించిన పాత్ర చేయడం తన అభిమానులకు కోపాన్ని తెప్పించాయని చెప్పాలి. చక్కటి ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకున్న సమయంలో ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని వారంతా తెగ బాధ పడిపోతున్నారు.

More Related Stories