వర్మకు పిచ్చి పట్టిందా.. ఏంటా వెర్రి డాన్సులు..Ram Gopal Varma
2019-12-25 01:00:56

ఇది మనం అంటున్న మాట కాదు.. స్వయానా ఆయన అభిమానులే సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అసలేమైంది వర్మ నీకు అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బ్యూటీఫుల్ సినిమా ఈవెంట్ లో ఈయన చేసిన డాన్సులు ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈ వైరల్ వీడియోను చూసి ఫ్యాన్స్ కూడా పరేషాన్ అవుతున్నారు. అసలేంటి ఈయన.. ఏమైంది ఈయనకు అంటూ షాక్ అవుతున్నారు. మొన్నటికి మొన్న అమ్మరాజ్యంలో అంటూ పిచ్చి సినిమా ఒకటి తీసి ఉన్న పేరు కూడా పోగొట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు మరోసారి పిచ్చి డాన్సులు అన్నీ చేసి ఇమేజ్ పాడు చేసుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాగింది ఇంకా దిగలేదా వర్మగారూ ఆయనపై నేరుగానే సైటైర్లు వేస్తున్నారు. మీరేంటి.. ఆ డాన్సులేంటి.. అసలు మీరు చేసింది డాన్సేనా అంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్లు. కుస్తీ పోటీలు, మల్లయుద్ధాలు చేసినట్లుంది కానీ ఎక్కడా డాన్స్ మాదిరి అనిపించడం లేదే అంటూ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. జనవరి 1న విడుదల కానుంది బ్యూటీఫుల్ సినిమా. దానికి క్రేజ్ పెంచడానికి తన ఇమేజ్ పణంగా పెట్టాడు ఈ దర్శకుడు.

More Related Stories