కీర్తి లుక్ చూసి అప్సెట్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్Keerthy Suresh
2020-11-07 14:08:19

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ పరిశ్రమను ఉపేస్తున్న నటి కీర్తి సురేష్. మహానటి సినిమాతో కీర్తి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమాలో కీర్తి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కీర్తి నటనకు మంచి మార్కులు పడటం ఏంటో కానీ వరుస పెట్టి లేడీ ఓరియెంట్ సినిమాల్లోనే నటిస్తోంది. ఇటీవల ఓటీటీ లో విడుదలైన "పెంగ్విన్, మిస్ ఇండియా" సినిమాలు లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. కాగా ఈ రెండు సినిమాలకు కూడా నెగిటివ్ టాక్ రావడం కీర్తికి పెద్ద మైనస్ అయ్యిందనే చెప్పాలి. ఇక మిస్ ఇండియా సినిమాలో నటించిన కీర్తి ఆ సినిమా కోసం చాలానే సన్నబడింది. ఎంత సన్నబడిందంటే గ్లామర్ కూడా పోయేంతలా సన్నబడింది. దాంతో మహేష్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. అదేంటి కీర్తి సన్నబడితే మహేష్ ఫ్యాన్స్ ఎందుకు అప్సెట్ అవుతున్నారు అనుకుంటున్నారా. ఎందుకంటే కీర్తి ప్రస్తుతం మహేష్ హీరోగా వస్తోన్న "సర్కారు వారిపాట" సినిమాలో హీరోయిన్ కాబట్టి. అసలు మహేష్ కు జీరో సైజ్ లో ఉన్న కీర్తి సెట్ అవుతుందా అని ఆందోళలన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ "రంగ్ దే, గుడ్ లక్ సఖి" లాంటి సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక కీర్తి మహేష్ సినిమా కోసం మళ్ళీ నార్మల్ అవుతుందా...మహేష్ ఫ్యాన్స్ కోరిక తీర్చుతుందా అన్నది చూడాలి.

More Related Stories