ఇంతకీ పెళ్లెప్పుడు అవుతుందమ్మా మీకు..sweety
2020-03-09 14:17:20

ఇండస్ట్రీలో అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. మరి నీ పెళ్ళెప్పుడు అని అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లను అడుగుతున్నారు అభిమానులు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే కుర్ర హీరోలు నితిన్, నిఖిల్ వాళ్లకు నచ్చిన అమ్మాయిలతో నిశ్చితార్థం చేసుకుని ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లతో పాటు మరి కొందరు హీరోలు కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడు. ఎప్పట్లాగే ప్రభాస్, రానా ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోవట్లేదని చెప్పేసారు. వాళ్ళని అడిగితే ఇప్పట్లో పెళ్లిపై తమకు ఆసక్తి లేదని సమాధానం చెబుతున్నారు.

మరోవైపు అనుష్క మాత్రం తమకు నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. అయితే ఇప్పటి వరకు ఆ నచ్చినవాడు ఎప్పటికి దొరకుతాడో అంటున్నారు ఫ్యాన్స్. దాంతో ఎప్పుడు బయటికి వచ్చినా కూడా ఈమెకు మొదటగా ఎదురయ్యే ప్రశ్న మీ పెళ్లెప్పుడు.. అడిగి అడిగి మీకు బోర్ రావట్లేదా అంటూ అప్పుడప్పుడు మీడియాపై సెటైర్లు కూడా వేస్తుంది అనుష్క. మరోవైపు నయనతార మాత్రం మూడేళ్లుగా విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తుంది. కానీ పెళ్లికి మాత్రం నో అంటుంది ఈమె. నయన్ జాతకంలో పెళ్ళి చేసుకుంటే విడిపోతారు అని రాసి ఉందని అప్పట్లో కొందరు జ్యోతిష్కులు ప్రచారం చేశారు. ఒక వేళ ఇదే నిజం అని నమ్మి కేవలం సహజీవనంతోనే నయనతార సరిపెట్టుకుంటుందేమో అనుకుంటున్నారు అభిమానులు. ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో కూడా శుభవార్త చెప్పడం లేదు ఈ ముద్దుగుమ్మలు.

More Related Stories